Thursday, February 12, 2009

Keerthanalu

GoviMdasrita GokulabruMda - గోవిందాశ్రిత గోకులబృందా


గోవిందాశ్రిత గోకులబృందా పావన జయజయ పరమానంద

జగధభిరామ సహస్ర నామ సుగుణధామ సంస్తు త నామ
గగనశ్యామ ఘనపురి భీమ అగణిత రఘువంశాంబుధి సోమ

జననుత చరణా శరణ్యు శరణా దనుజ హరణ లలిత స్వరణా
అనఘ చరణాయుత భూభరణా దినకర సన్నిభ దివ్యాభరణా

గరుడ తురంగా కరోత్తుంగా శరధి భంగా ఫణిశయనాంగా
కరుణాపాంగా కమల సంగా వర శ్రీవేంకట గిరిపతి రంగా

Kulukaga Nadavaro - కులుకక నడవరో
















Raga : ATaNa , composer : Nedunuri Krishnamurty

కులుకక నడవరో కొమ్మలాలా - జలజల రాలీని జాజులు మాయమ్మకు
...
ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో - గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద- అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు
...
చల్లెడి గందవొడియై జారీ నిలువరో - పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర - గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు
...
జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరోర - మణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె - సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు

Muddugare Yashoda - ముద్దుగారే యశోద




Audio link : Nedunuri Krishnamurthy
1. Muddugare Yashoda - ముద్దుగారే యశోద

-----------------------------------------

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు

తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

..

అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము

పంతమాడే కంసుని పాలి వజ్రము

కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస

చెంతల మాలోనున్న చిన్ని కృష్నుడు

..


రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము

మితి గోవర్థనపు గోమేధికము

సతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యము

గతియై మమ్ము గాచే(టి)కమలాక్షుడు

...


కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము

ఏలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము

పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము

బాలుని వలె తిరిగే పద్మనాభుడు


Emani PogaDudume - ఏమని పొగడుదమే



ఏమని పొగడుదుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగ

తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయగ విభునికి వెన్నెలలు
పులకల మొలకల పాదులివి గదవే
పలుమరు బువ్వుల పానుపులు

తియ్యపు నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు

కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీవేంకటేశ్వరుని సిరి నగరు
తావు కొన్న మీ తమకములే కదే
కావించిన కల్యాణములు

BhavayamiGopalaBalam-భావయామి గోపాలబాలం

భావయామి గోపాలబాలం మన
సేవితం తత్పదం చింతయేయం సదా

కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా
పటల నినదేవ విభ్రాజమానం
కుటిల పద ఘంటిత సంకుల శింజీతేన తం
చటుల నటనా సముజ్జ్వల విలాసం ... భావయామి

నిరత కర కలిత నవనీతం
బ్రహ్మాది సుర నికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం … భావయామి

DevaDevaMBhajeDivyaPrabhavam-దేవ దేవం భజే దివ్యప్రభావం

దే దేవం భజే దివ్యప్రభావం
రాణాసురవైరి ణపుంగవం

రావరశేఖరం వికులసుధాకరం
జానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం

నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం

పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం

Chalada harinama - చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు

చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చవులెల్లను నొసగ
..
ఇది యొకటి హరి నామ మింతైన జాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ

మదినొకటె హరినామ మింతైన జాలదా పదివేల నరక కూపముల వెడలించ
..
కలదొకటి హరినామ కనకాద్రి చాలదా తొలగుమని దారిద్ర్యదోషంబు చెఱచ

తెలివొకటి హరినామదీప మది చాలదా కలుషంపు కఠిన చీకటి పారద్రోల
...
తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్ప భూజంబు వలెనుండ

సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా నగవు జూపులను నున్నతమెపుడు జూప

NanatiBatukuNatakamu - నానాటి బదుకు నాటకము

నానాటి బదుకు నాటకము

కానక కన్నది కైవల్యము


పుట్టుటయు నిజము పోవుటయు నిజము

నట్టనడిమి పని నాటకము

యెట్ట నెదుట గల దీ ప్రపంచము

కట్ట గడపటిది కైవల్యము


కుడిచే దన్నము కోక చుట్టెడిది

నడ మంత్రపు పని నాటకము

వొడి గట్టుకొనిన వుభయ కర్మములు

గడి దాటినపుడె కైవల్యము


తెగదు పాపము తీరదు పుణ్యము

నగి నగి కాలము నాటకము

యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక

గగనము మీదిది కైవల్యము

NarayanatheNamoNamo-నారాయణతే నమో నమో


నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో॥

మురహర భవహర ముకుంచ మధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో॥

జలధిశయన రవిచంద్రవిలోచన
జలరుహభవనుత చరణయుగ
బలిబంచన గోపవధూవల్లభ
నలినోదర తే నమో నమో॥

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహనరూప
వేదోద్దర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో॥

Podagantimayya - పొడగంటిమయ్య


పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము (రాగం - అట్టతాళం)

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా

భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా

Saranu Saranu Surendra Sannuta - శరణు శరణు సురేంద్ర సన్నుత

శరణు శరణు సురేంద్ర సన్నుత


శరణు శ్రీసతి వల్లభ
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకట నాయక

కమల ధరుడును, కమల మిత్రుడు
కమల శత్రుడు, పుత్రుడు
క్రమముతో మీకొలువు కిప్పుడు
కాచినారెచ్చరికయా

అనిమిషేంద్రులు మునులు దిక్పతులు
అమర కిన్నెర సిధ్ధులు
ఘనతతో రంభాది కాంతలు
కాచినారెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు
నిన్ను కొలువగా వచ్చిరి
విన్నపము వినవయ్య
తిరుపతివేంకటాచల నాయకా
SaraNu SaraNu suraeMdra sannuta SaraNu Sreesati vallabha SaraNu raakshasa garva saMhara SaraNu vaeMkaTa naayaka kamala dharuDunu, kamala mitruDu kamala SatruDu, putruDu kramamutO meekoluvu kippuDu kaachinaarechcharikayaa animishaeMdrulu munulu dikpatulu amara kinnera sidhdhulu ghanatatO raMbhaadi kaaMtalu kaachinaarechcharikayaa ennagala prahlaada mukhyulu ninnu koluvagaa vachchiri vinnapamu vinavayya tirupativaeMkaTaachala naayakaa

Shrimannarayana - శ్రీమన్నారాయణ


శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు


కమలాసతీ ముఖకమల కమల హిత

కమలప్రియ కమలేక్షణ

కమలాసనహిత గరుడకమనశ్రీ

కమలనాభ నీ పదకమలమే శరణు

..

పరమయోగిజన భాగధేయ శ్రీ

పరమపూరుష పరాత్పర

పరమాత్మ పరమాణు రూప శ్రీ

తిరువేంకటగిరి దేవ శరణు

TirumalagiriRaya - తిరుమల గిరి రాయ

తిరుమల గిరి రాయ దేవరాహుత్త రాయ
సురతిబిన్నాణరాయ సుగుణకోనేటి రాయ

సిరులసింగారరాయ చెలువపు తిమ్మరాయ
సరసవైభవరాయ సకలవినోదరాయ
వరవసంతములరాయ వనితలవిటరాయ
గురుతైన తేగరాయ చల్లబరిమళరాయ

గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ

సామసంగీత రాయ సర్వమోహనరాయ
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను
శ్రీమంతుడ నీకు జయ శ్రీ వేంకటరాయ

Vinnapalu Vinavale Vinthavinthalu - విన్నపాలు వినవలె వింత వింతలు


విన్నపాలు వినవలె వింత వింతలు

పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా


తెల్లవారె జామెక్కె దేవతలు మునులు

అల్లనల్ల నంతనింత నదిగోవారే

చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు

మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా


గరుడ కిన్నరయక్ష కామినులు గములై

విరహపు గీతముల వింతాలాపాల

పరిపరివిధముల బాడేరునిన్నదివో

సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా


పొంకపు శేషాదులు తుంబురునారదాదులు

పంకజభవాదులు నీ పాదాలు చేరి

అంకెలనున్నారు లేచి అలమేలుమంగను

వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా

Vinaro Bhagyamu Vishnu Katha - వినరో భాగ్యము విష్ణుకథ












వినరో భాగ్యము విష్ణుకథ - వెనుబలమిదివో విష్ణు కథ
..
ఆదినుండి సంధ్యాదివిధులలోవేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచేవీదివీధులనే విష్ణుకథ
..
వదలక వేదవ్యాసులు నుడిగినవిదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్థనయైవెదకినచోటనే విష్ణుకథ.
..
గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగవెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామమువెల్లిగొలిపె నీవిష్ణుకథ.




No comments:

Post a Comment